Friday, November 20, 2009

PRIYATAMA NANU PALAKARINCHU(JAGADEKAVEERUDU-ATILOKASUNDARI)


Priyatama nanu palakarinchu pranayama
atidhila nanu cherukunna hrudayama
bratukuloni bandhama palukaleni bhavama
maruvaleni snehama maralirani nestama(priyatama)
edutavunna swargama chediriponi swapnama
kanulaloni kavyama kougilinta pranama
priyatama..priyatama..priyatama..(priyatama)

Ningi veenakemo neela pataloche
telugu jilugu anni telisi
parijatapuvvu pachi malle mogga
valape telipe nalo virisi
machalenno unna chandamamakanna
narude varudai nalo merise
taralammakanna cheerakattukunna
paduchutaname nalo murise
mabbulanni vidipoyi
kalise nayanam telise hrudayam
taralanni daatagane
tagile gaganam ragile viraham
rayaleni bhashalo enni premalekhalo
raayilanti gontulo enni muugapatalo
aduge padaka gaduve gadiche piliche(priyatama)

Praanavayuvedo venuvuudipoye
srutilo jatilo ninne kalipi
devagaanamanta enki patalaye
manasu mamata anni kalisi
vennelalle vachi vedamantramaye
bahusa manasa vacha valachi
menakalle vachi janakalle mare
kulamu gunamu anni kudiri
neevu leni ningilona
velige udayam vidhike nilayam
neevu leni nela meeda
bratuke pralayam manase maranam
vanavillu gundelo neetikenni rangulo
amrutala vindulo endukinni haddulo
jagame anuvai yugame kshanamai migile(priyatama)


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా(ప్రియతమా)
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..(ప్రియతమా)

నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్ని తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపే తెలిపె నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామకన్న
నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్న చీరకట్టుకున్న
పడుచుతనమే నాలో మురిసే
మబ్బులన్ని వీడిపోయి
కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్ని దాటగానే
తగిలే గగనం రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచే పిలిచే(ప్రియతమా)

ప్రాణవాయువేదో వేణువూదిపోయే
శ్రుతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలయే
మనసు మమత అన్ని కలిసి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
బహుశా మనసా వాచా వలచి
మేనకల్లె వచ్చి జానకల్లె మారె
కులము గుణము అన్ని కుదిరి
నీవు లేని నింగిలోన
వెలిగే ఉదయం విధికే నిలయం
నీవు లేని నేల మీద
బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే(ప్రియతమా)

11 comments:

  1. thanks for the lyrics

    ReplyDelete
  2. Thank You so much for the lyrics

    ReplyDelete
  3. What can i say..except thank you...

    ReplyDelete
  4. Wonderful song! Thanks a lot

    ReplyDelete
  5. wonderful lyrics collection...

    ReplyDelete
  6. ADBHUTAMAYINA PAATA..HUSHARAYINA PALLAVI AND CHARANALU...DHANYAVADALU..
    _ABHI9

    ReplyDelete
  7. Thanks Brother..
    And it is "vidhike vilayam".

    Best Regards :-)

    ReplyDelete
  8. Great service for music lovers. Thanks for ur contribution

    ReplyDelete