Thursday, February 24, 2011

MATTU VADALARAA NIDDURA MATTU VADALARA(SRI KRISHNA PANDAVEEYAM)

apayammu datadanikupayammu kavali
andhakaramalaminapudu veluturukai vedakali
mundu chupu lenivadu yendunaku koragadu
somariyai kunuku vadu sukshmammu grahinchaledu

mattu vadalaraa niddura mattu vadalaraa
aa mattulona badite gammattuga chittavuduvuraa

jeevitamuna sagabhagam niddurake saripovu
migilina aa sagabhagam chittashuddi lekapovu
ati nidraa loludu telivi leni murkhudu
paramardham kanaleka vyardhamgaa chedatadu

saginanta kalam na anta vadu ledanduru
sagakapote uraka chatikilabadipoduru
kandabalamutote ghanakaryamu sadhinchaleru
buddi balamu todaite vijayammu varimpagalaru

chuttu muttu apadalanu mattu betta bunumuraa
pirikitanamu kattipetti dhairyamu chepattumuraa
kartavyamu ne vantu kapaduta na vantu
cheppadame na dharmam vinakapote ne kharmam


అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందు చూపు లేనివాడు ఎందునకూ కొరగాడు
సోమరియై కునుకు వాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదువురా

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన సగభాగం చిత్తశుద్ది లేకపోవు
అతి నిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు

సాగినంత కాలం నా అంత వాడు లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలముతోనే ఘనకర్యము సాధించలేరు
బుద్ది బలము తోడైతే విజయమ్ము వరింపగలరు

చుట్టు ముత్తు ఆపదలను మట్టు బెట్ట బూనుమురా
పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు
చెప్పడమే నా ధర్మం వినకపోతే నే ఖర్మం

2 comments: