Friday, February 11, 2011

TELUGU PADANIKI JANMADINAM(ANNAMAYYA)


telugu padaniki janmadinam idi janapadaniki jnyanapadam
yedu swarale yedu kondalai velasina kaliyuga vishnu padam
annamayya jananam idi annamayya jananam

arishadvargamu teganarike hari khadghammidi nandakamu
brahmalokamuna chidvilasamuna damarudhvanilo gamakitamai
divya sabhalalo navyalasyamula pubantula chebantiga yegasi
neerada mandala narada tumbura mahati ganapu mahimalu telisi
shitahimakandara yatiraat sabhalo tapah phalammuga talukumani
talli tanamukai talladillu aa lakkamamba garbhashayammulo
praveshinche aa nandakamu nandanananda karakamu
annamayya jananam idi annamayya jananam

padmavatiye purudu poyagaa padmasanude usuru poyagaa
vishnutejamai nada beejamai andhra sahiti amarakoshamai
avatarinchenu annamaya asatomaa sadgamaya
avatarinchenu annamaya asatomaa sadgamaya

papadugaa nattinta pakutu bhagavatamu chepattenayaa
harinaamamu alakinchaka ara muddalane muttadayaa
telugu bharatiki velugu haratai yedalayalo pada kavitalu kalaya
tallapakalo yedige annamaya tamasoma jyotirgamaya
tamasomaa jyotirgamaya tamasomaa jyotirgamaya


తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్య సభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్ సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు లక్కమాంబ గర్భాశయమ్ములో
ప్రవేశించె నందకము నందనానంద కారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామము ఆలకించక అర ముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమ జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ

1 comment: