Tuesday, May 31, 2011

SANDHYA RAGAPU SARIGAMALO(INDRUDU CHANDRURU)


స్వర్గం అంటూ ఉంటే పాట వినకుండా చచ్చిపోయిన వారికి అది దొరకదని నా అభిప్రాయం....పాటతో మనుషుల్నిచంపేసే హంతకుడు రాజా...అసలు చరణానికి అంత అందమైన ఎండింగ్ ఎవరిస్తారు...పాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా...వెయ్యి సార్లు వినుంటాను line నేను...బాలు end చేయడం వెంటనే జానకి అందుకోవడం...may be this is called the complexicity of veturi....వలపు పొడుపు కధలలో చిలిపు ముడులు తెలిసాయా...ఏం చెప్తాం వీళ్ళ గురించి...



sandhya ragapu sarigamalo toli kalayikalo
sayamkalapu chalichali uhala pakapakalo
doremi raagala joremi
dasaga na prema ne meeda shruti kalisina

chinuku chinuku nadumulo chilakaluliki padenule
kanula kanula nadumalo kalala sudulu tirigele
pedavi pedavi tadupulo valapu madhuvu tonikele
tanuvu tanuvu kudupulo tamakamokati merisele
sandhyalo taralaga swapnamaipokumaa
kannelo soyagalu kantitone tagumaa
hamsalaa haayigaa aamani reyilaa valipoo priyaa...

edutapadina bidiyame chemata nuduta chilikele
onuku tonuku paruvame vadiki vayasu kalipele
valapu podupu kadhalalo chilipi mudulu videnule
marula virula podalalo marudi purudu jarigele
tenele dochukelle tummedaipokumaa
galike gandhamiche kougilinte duramaa
patala totalo pallave premagaa paduko priyaa


సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
డోరేమి రాగాల జోరేమి
దసగ నా ప్రేమ నీ మీద శృతి కలిసిన

చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే
కనుల కనుల నడుమలో కలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే
తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగ స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా
హంసలా హాయిగా ఆమని రేయిలా వాలిపో ప్రియా...

ఎదుటపడిన బిడియమే చెమట నుదుట చిలికెలే
ఒణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కధలలో చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదైపోకుమా
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా
పాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా


3 comments: